Homemain slidesరాత్రికిరాత్రే పరీక్ష వాయిదా.. అభ్యర్థుల పరిస్థితేంటి ?

రాత్రికిరాత్రే పరీక్ష వాయిదా.. అభ్యర్థుల పరిస్థితేంటి ?

భారత్ సమాచార్.నెట్, విశాఖపట్నం: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నేడు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పరీక్ష రాత్రికి రాత్రికి వాయిదా వేయడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సుమేధ సొల్యూషన్ వారు పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి నోటీసు బోర్డుకూడా పెట్టలేదన్నారు. తమకి జేసీఐ పూర్తి భాధ్యతగా రవాణా ఛార్జీలు చెల్లించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చామని, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా పరీక్ష వాయిదా వేయడం ఏంటని అభ్యర్థులు మండిపడుతున్నారు. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 90 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments