Homemain slidesతెలంగాణ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు రూ.10వేల స్టైఫండ్

తెలంగాణ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు రూ.10వేల స్టైఫండ్

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ నుంచి సివిల్ సర్వీస్ లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం తాజాగా శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్(TSBCESDTC)ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్.. సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్, మెయిన్స్)ఎగ్జామ్ కి సంబంధించి ఉచిత కోచింగ్ ను అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 3వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా అప్లే చేసుకోవాలని అధికారులు తెలిపారు. అన్ని అర్హతలు కలిగి పోటీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తో పాటుగా వసతి, భోజన ఖర్చుల కింద రూ.5000, బుక్‌ఫండ్‌ కింద రూ.5000 స్టైఫండ్ ను అందజేయనున్నారు.

విద్యార్హత…

అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి వార్షిక ఆదాయం రూ.5.00 లక్షలకు మించి ఉండకూడదు. వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి

సీట్ల సంఖ్య

రాష్ట్రం మొత్తం మీద 150 మందికి ఫ్రీ కోచింగ్ ను అందజేయనున్నారు. ఈ 150 మందిలో బీసీలకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, ఇతరులకు 5% సీట్లను కేటాయించారు. ఇందులో 100 మందిని ఆన్‌‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లు సివిల్స్‌ ఫ్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు.ఈ ఉచిత శిక్షణను హైదరాబాద్ లో 18.07.2024వ తేదీ నుంచి 18-04-2025వ తేదీ వరకు నిర్వహిస్తారు.

ఎంపిక విధానం

ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.మరిన్ని వివరాలకు ఆఫ్ లైన్ లో టీజీ బీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ నందు సంప్రదించాలి. మరిన్ని వివరాలకు (TSBCESDTC) అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాల్సిందిగా అధికారులు సూచించారు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.

ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 07-07-2024.

పరీక్ష ఫలితాల వెల్లడి: 10-07-2024.

శిక్షణ ప్రారంభ తేదీ: 18-07-2024

మరికొన్ని విశేషాలు…

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments