Homebreaking updates newsభారత్ లో ఆయువు తీస్తున్న వాయువు...

భారత్ లో ఆయువు తీస్తున్న వాయువు…

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

కేవలం వాయు కాలుష్యం కారణంగానే భారతదేశంలో ప్రతి  సంవత్సరం 33 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య వార్తా పత్రిక ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్ తాజాగా పేర్కొంది. అందరూ ఊహించినట్లే వారిలో 12 వేల మంది దేశ రాజధాని ఢిల్లీ వాసులే ఉంటున్నారని లాన్సెట్ నివేదిక తాజాగా తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సంవత్సరానికి వాయు కాలుష్యం కారణంగా 1,600 మంది చనిపోతున్నారని తెలిపింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, ముంబై, సిమ్లా, వారణాసి భారతదేశ రాష్ట్ర రాజధానుల్లో, అతి పెద్ద జనావాస నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో దాదాపు 7 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని ఈ నివేదికలో పేర్కొంది.

భారీగా పొగను ఉత్పిత్తి చేసే కర్మాగారాలు, ప్రతి ఏటా పెరుగుతున్న వాహన వినిమయం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా అధికంగా కాలుష్యం జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కేవలం దేశ రాజధాని నగరంలో మాత్రమే వాయు కాలుష్యం గురించి చర్చలు జరుగుతున్నాయి, వాటికి నివారణ చర్చలు చేపడుతున్నారు. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా వాయు కాలుష్యం పై అవగాహన పెంచి, నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మరికొన్ని తాజా వార్తా విశేషాలు…

పీల్చే గాలి… తాగే నీరు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments