భారత్ సమాచార్, జాతీయం ;
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల కోసం, ముఖ్యంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల సమాచార లోపంతో పాటుగా అనేక కారణాలతో చాలా మంది లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందటం లేదు. అందులో ప్రధానంగా గర్భిణీ స్త్రీల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకం ‘‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’’. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అర్హత కలిగిన గర్భిణీ స్త్రీల అకౌంట్లలో రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. 2017వ సంవత్సరం నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై పూర్తిగా అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు https://pmmvy.wcd.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.