భారత్ సమాచార్.నెట్, ముంబయి : టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ మరో మైలు రాయిని అధిగమించాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన కోహ్లీ.. టీ20 ఫార్మాట్‌లో 13,000 పరుగుల మార్క్ చేరుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం 386 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన కోహ్లీ, మళ్లీ ఒకసారి తన స్థాయిని ప్రపంచానికి నిరూపించాడు. 42 బంతుల్లో 67 పరుగులు చేసిన విరాట్, తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. అంతేకాదు, కోహ్లీ 13 వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఐదో ఆటగాడిగా కూడా నిలిచాడు. అతడికంటే ముందు వెస్ట్ ఇండీస్ విధ్వంసకుడు క్రిస్ గేల్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, పాకిస్తాన్ స్టార్ షోయబ్ మాలిక్, ఇంకా క్యారిబియన్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఈ ఘనతను సాధించారు. కాగా..ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “విరాట్ ఓ మిషన్ మీద ఉన్నాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంచనాలు ఏవైనా ఉన్నా.. వాటికి మించిన ఆటతీరు కనబర్చడంలో కోహ్లీ ఇప్పటికీ లెజెండ్‌గానే నిలుస్తున్నాడని అంటున్నారు.
టీ20ల్లో 13,000 పరుగులు చేసిన బ్యాటర్లు
14562 – క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌లు)
13610 – అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌లు)
13557 – షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌లు)
13537 – కీరన్ పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌లు)
13050 – విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లు)