భారత్ సమాచార్. నెట్, ముంబయి: ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు ఖాతాలో వేసింది. విరాట్ కోహ్లీ (67; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రజత్ పటీదార్ (64; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దేవ్‌దత్ పడిక్కల్ (37) మెరుపులు మెరిపించగా, జితేశ్ శర్మ (40 నాటౌట్) చివర్లో అద్భుతంగా ఆడాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్, బౌల్ట్ తలా రెండు వికెట్లు తీసారు.
ఛేసింగ్ లో ముంబయి ఇండియన్స్ 209 పరుగులకే పరిమితమయ్యింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో), హార్దిక్ పాండ్య (42; 15 బంతుల్లో) మెరుపులు మెరిపించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో వికెట్లు వేగంగా పడటంతో జట్టు గెలుపు దిశగా సాగలేకపోయింది. ఆర్సీబీ బౌలింగ్‌లో కృనాల్ పాండ్య నాలుగు వికెట్లు తీసి స్పెల్‌ను కట్టిపడేశాడు. యశ్ దయాల్, హేజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు తీసారు.ఈ విజయంతో బెంగళూరు తమ ప్లేఆఫ్స్ ఆశలకు ఊపిరి పోసింది. కోహ్లీ మరోసారి తన ఫామ్‌ను నిరూపించగా, పటీదార్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయ్యారు.