భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు మిన్నా, ఎదుటి వారికి తనవంతుగా సాయం చేసేందుకు ఎప్పుడు ముందుండే ‘సహయోగ్’ ఫౌండేషన్ సమాజంలో ప్రత్యేక గుర్తింపును చాటుతుంది. చిన్న వాట్సాప్ గ్రూపులో స్టార్ట్ అయిన ఈ సేవా ప్రస్థానం క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. ఇప్పటికి మొత్తం 18మందికి ఆర్థిక చేయూతను అందించి బాధితుల పక్షాన అండగా నిలుస్తుంది. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ. 1,33,000 సాయం చేసినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. వృత్తి పట్ల నిబద్ధతతోపాటు, సమాజం పట్ల బాధ్యత కలిగిన యువకులు సహయోగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని కొంత మంది మిత్రులు వారి మిత్రులకు తెలుపుతూ ప్రతీ నెల కొంత అమౌంట్‌ను జమ చేసి ఆపదలో ఉన్నవారికి ఇలా డొనేట్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సాయం చేస్తే నాకేం వస్తుందనే ఆలోచించే ఈ రోజుల్లో, అనువుణునా స్వార్థంతో నిండి ఉన్న ఈ ఆధునిక యుగంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయని పలువురు ఫౌండేషన్ సేవలను కొనియాడారు.
బాధితులకు అండగా నిలుస్తున్న సహయోగ్ ఫౌండేషన్
RELATED ARTICLES