భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy Cm Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్ (Singapore)లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident)లో మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో చేతులు, కళ్ళకు స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం మార్క్ శంకర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజాగా సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదలైంది. మార్క్ శంకర్ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. కాగా, మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిందని విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు షేర్ చేశారు.
ఇదిలా ఉంటే పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. మరోవైపు మార్క్ ప్రమాదానికి గురైన సంగతి తెలుసుకున్న పవన్ అల్లురి పర్యటన రద్దు చేసుకుని సింగపూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లారు.