భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తన బ్రాండ్ యంగ్ ఇండియా (Young India is my Brand) అని తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) స్పష్టం చేశారు. ఎన్టీఆర్ (NTR)కు రెండు రూపాయలకు కిలో బియ్యం.. వై.యస్. రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy)కి జలయజ్ఞం ఎలాగైతే బ్రాండ్‌గా మారిందో యంగ్ ఇండియాను తన బ్రాండ్‌గా మార్చుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy Dist) మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ దగ్గర నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ ప్రారంభించిన అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తరగతి గదులు బలంగా ఉంటేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని.. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది తమ బ్రాండ్ అని చెప్పారు. యువతకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని.. దేశంలోనే ది బెస్ట్ వర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏటా లక్షమందికి పైగా విద్యార్థులు తెలంగాణలో బీటెక్ పూర్తి చేస్తున్నారు. కానీ వారిలో నాణ్యత ఎంతంటే.. ఎవరి దగ్గరా సమాధానం లేదన్నారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కనీసం అప్లికేషన్లు కూడా సరిగా నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొస్తున్నామని.. సైనిక్ స్కూల్స్ తరహాలో ఈ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. త్వరలో ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రి స్కూల్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం రేవంత్. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం తరగతి గదులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి గ్రౌండ్‌లో పిల్లలతో కలిసి కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఇకపోతే 50 ఎకరాల్లో ఈ స్కూల్‌ను నిర్మించిన రేవంత్ సర్కార్.. దీనికి 2024 అక్టోబర్ 21న యంగ్ ఇండియా శంకుస్థాపన చేసింది. కాగా, తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్‌పీఎఫ్ జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు ఈ స్కూల్‌లో విద్యను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.