భారత్ సమాచార్.నెట్, టోక్యో: బీఆర్ఎస్ నేత (Brs Leader), మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) మరోసారి వార్తల్లో నిలిచారు. తన సతీమణితో కలిసి సమ్మర్ ట్రిప్ (Summer Trip) కోసమని జపాన్ (Japan) పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ రోజుకో ప్రాంతంలో పర్యటిస్తూ చిల్ అవుతున్నారు. సెలవులను ఆస్వాదిస్తూ, జపాన్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అక్కడి సంస్కృతి, ప్రకృతిని చూసి మురిసిపోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు (Photos, Videos) సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ (Viral) అవుతున్నాయి.
తాజాగా ఆ దేశంలోని టోక్యో నగరంలో జరిగిన జాపనీస్ ట్రేడిషనల్ టీ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి దంపతులు జపాన్ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని వెరైటీ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే వివిధ ప్రదేశాలను సందర్శిస్తున్న ఆయన స్థానిక ప్రజలతో కూడా ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. మల్లన్న మాస్ అని.. మల్లన్నా తగ్గేదేలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు బుల్లెట్ ట్రైన్ ఎక్కారు మల్లారెడ్డి. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకొచ్చినా వంటి డైలాగ్స్‌తో పాటు డీజే టిల్లు సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన మల్లారెడ్డికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. జీవితంలో చిన్న చిన్న పనులు చేసుకొని.. రియల్ ఎస్టేట్ చేసి ఎదిగి.. ప్రైవేటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో మల్లారెడ్డి తన సంపాదనను పతాక స్థాయికి చేర్చుకున్నాడు. జీవితంలో అన్ని కోరికలు నెరవేరినాయని చెప్పుకునే మల్లారెడ్డి ప్రతిపక్ష ప్రజాప్రతినిధిగా చేసేదేముందనుకున్నాడో ఏమోగాని విదేశీ పర్యటనకు వెళ్లారు.