Homemain slideshanuman jayanti హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు..?

hanuman jayanti హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీన శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు జయంతి వేడుకల్లో భాగంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ర్యాలీలు, శోభాయాత్రలు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. హిందూ ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుడు. రామ భక్త హనుమాన్ ఆలయం ఎక్కడ చూసినా కనిపిస్తారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడిని ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, పవన పుత్రుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని పిలుస్తారు.

ఏడాదికి రెండుసార్లు హనుమాన్ జయంతి ఎందుకంటే:
హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్రపూర్ణిమ (పుట్టినరోజు), రెండవది కార్తీక కృష్ణ చతుర్దశి (విజయ అభినందన మహోత్సవం) రోజు. ఎందుకంటే ఒక కథ హనుమంతుడి జన్మకు సంబంధించింది కాగా, మరొకటి అతను స్పృహ కోల్పోయిన తర్వాత తిరిగి జీవించడానికి సంబంధించినదిగా పేర్కొంటారు. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు స్వాతి నక్షత్రంలోని కార్తీకమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జన్మించాడు. అందువల్ల ఈ రోజును హనుమంతుని అవతార ఉత్సవంగా భావించి జన్మదినాన్ని జరుపుకుంటారు. అదే సమయంలో, చైత్ర మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమంతుడి విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు.చైత్ర పూర్ణిమ నాడే హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటామంటే, హనుమంతుడు చైత్రపూర్ణిమ రోజు రెండవ జన్మ లభించింది. కాబట్టి ఈ రోజును అతని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా కార్తీకకృష్ణ చతుర్దశి రోజున హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటామంటే హిందూ మతవిశ్వాసాల ప్రకారం కార్తీక కృష్ణ చతుర్దశి నాడు తల్లి సీత హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చింది. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు.

కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం:
అయితే పురాణాల ప్రకారం ఇలా రెండుసార్లు జన్మదినోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఉంది. శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకటమోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని.. తన భక్తులను కష్టాల నుంచి కాపాడతాడని హిందువుల విశ్వాసం. హనుమంతుడి జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే హనుమాన్ జయంతిని సంవత్సరానికి ఒకసారి కాదు, రెండుసార్లు జరుపుకుంటారు. 2025 హనుమాన్ జన్మదినోత్సవం ఎప్పుడంటే ఈ సంవత్సరం చైత్రపౌర్ణమి ఏప్రిల్ 12న వచ్చింది. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో, ఏప్రిల్ 13న ఉదయం 5:52 గంటలకు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 12న హనుమంతుడి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments