భారత్ సమాచార్.నెట్, కడప: ఏ దేశానికి లేని గొప్ప వారసత్వ సంపద (Heritage) మన దేశానికి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrabau Naidu) అన్నారు. దేవాలయాలు (Temples) మన వారసత్వ సంపదని.. ఆ దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ (Family System) ఉండేది కాదన్నారు. మన తర్వాత వారసులకు కూడా మనం వారసత్వాన్ని (Inheritance) అందించాలన్నారు. రాముడి పాలన (Rama’s reign) ఇవ్వాలని, రామరాజ్యం తేవాలనేది తన ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీరాముడి సాక్షిగా.. ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే తన ఆలోచన అని అన్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్‌లో పేదరికం లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. సంపాదనలో కొంత దేవుడుకి ఇచ్చి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. దేవునికి సేవ చేయడం అంటే మనతో ఉన్నవారిని సమానంగా పైకి తీసుకురావడమేనని.. శ్రీరాముడి స్ఫూర్తితో పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరారు. ఒంటిమిట్ట శ్రీకోదండారామస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
ఒంటిమిట్టలో బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణం జరుపుకున్నామని.. వారిద్దరిదీ ఆదర్శ దాంపత్యమన్నారు. విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణం అత్యంత వైభవంగా చేసుకుంటున్నామన్నారు. అంతకుముందు భద్రాచలంలోనే కళ్యాణం రాములోరి దర్శనం చేసుకొనేవాళ్లమన్నారు. అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చామని.. ఒంటిమిట్ట ఆలయాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తామని.. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం రెండు మూడు రోజులు ఉండేలా సదుపాయాలను కల్పిస్తామన్నారు.