భారత్ సమాచార్.నెట్: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి రాత్రి వేళ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు (Photos) సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral in Social Media) మారాయి. ఐఎస్ఎస్ విడుదల చేసిన ఈ ఫొటోలు నెటిజన్‌లను ఆకట్టుకుంటోంది. వీటిలో, నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద కాంతివంతంగా వెలుగులతో మెరుస్తున్న భారత్‌దేశం (India) ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “పైన నక్షత్రాలు, కింద నగరాల వెలుగులు.. అట్మాస్ఫెరిక్ గ్లోతో భూమి అంచు” అంటూ ఐఎస్ఎస్ తన పోస్టులో పేర్కొంది. ఐఎస్ఎస్ విడుదల చేసిన ఈ ఫొటోలకు విశేషమైన స్పందన వస్తోంది.
సోషల్ మీడియాలో భారత్ దేశం ఫొటో నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తోంది. ఐఎస్ఎస్ భారత్ ఫొటో పోస్ట చేసినప్పటి నుంచి ఈ పోస్ట్‌కు 1,11, 000 వ్యూస్.. దాదాపు 2 వేలకు పైగా లైక్‌లు 400 కంటే ఎక్కువ రీపోస్టులను నెటిజన్ల నుండి ఈ పోస్ట్ పొందింది. ఈ అద్భుతమైన చిత్రాన్ని తీసినందుకు పలువురు కామెంట్ సెక్షన్లలో ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక భారత్‌తో పాటు మరిన్ని ప్రాంతాల దృశ్యాల్ని కూడా ఐఎస్ఎస్ సోషల్ మీడియాలో పంచుకుంది.
పశ్చిమ అమెరికాలోని మేఘావృతమైన ప్రాంతం, ఆగ్నేయాసియా తీర, లోతట్టు ప్రాంతాలు, ఆకుపచ్చని కాంతులతో ఆవరించి ఉన్న కెనడాను కూడా చూడొచ్చు. భూమి వక్రత కారణంగా, ఈ ఫొటోల్లో ఆకాశం వంపు తిరిగినట్టుగా మరింత అందంగా కనిపిస్తోంది. ఐఎస్ఎస్ ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్న కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. కాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 370 – 460 కిమీ ఎత్తులో తిరుగుతూ ఎప్పటికప్పుడు తీసిన చిత్రాలను ఇలా ప్రపంచంతో పంచుకుంటోంది.