భారత్ సమాచార్.నెట్: హర్యానా (Haryana)లోని సోనిపట్(Sonipat) ప్రాంతంలో ఉన్న ఓపీ జిందాల్ యూనివర్సిటీ (OP Jindal University)కి చెందిన ఓ విద్యార్థి (Student) తన గర్ల్‌ఫ్రెండ్ (GirlFriend)ను సూట్‌కేసులో (Suitcase) బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సంఘటన అందిరికీ తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు యూనివర్సిటీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
అయితే యూనివర్సిటిలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు .. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. తోటి స్నేహితులు ఆ అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లోని వివిధ ఏరియాల్లో తిపారని.. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారని చెప్పారు. సూట్‌కేసు తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చిందని.. ఈ వీడియోను కొందరు తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇలా చేసిన విద్యార్థులకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇకపోతే జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. సూట్‌కేసు అనుమానాస్పదంగా ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది అపి.. చెక్ చేశారు. దీంతో అందులో నుంచి అమ్మాయి బయటకు రాగా.. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు.