భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (B.R.Ambedkar) జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఆదేశాలు జారీ చేయడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి (Union Minister) బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) విమర్శించారు. కాంగ్రెస్ తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాప పెట్టినట్లుగా ఉందన్నారు. తక్షణమే బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దీ అని అన్నారు. ఆయనపై కుట్ర చేసి రెండుసార్లు ఒడించిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అంబేద్కర్‌కు భారత్ రత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయనను ఓడించిన వ్యక్తికి కాంగ్రెస్ పద్మభూషణ్ ప్రధానం చేసిందన్నారు. అలాంటి పార్టీ ఈరోజు అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించానడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్‌ను దారుణంగా అవమానించిన కాంగ్రెస్ ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని చెప్పడం విడ్డూరమన్నారు.
బీజేపీ కృషితోనే అంబేద్కర్‌కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చిందని.. అంబేద్కర్ స్మారక స్టాంపులు, బిల్లులు విడుదల చేశామని.. పార్లమెంట్, సుప్రీంకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖలో అంబేద్కర్ చిత్రపటం, విగ్రహాలను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకకే దక్కిందన్నారు. అంబేద్కర్ భిక్షవల్లే ప్రధాని కాగలిగానని మోదీ అన్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో శక్తివంతమైన సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వానికి అండగా ఉండాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.