భారత్ సమాచార్.నెట్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మాస్ డైరెక్టర్ అట్లీ (Director Atlee) కాంబినేషన్‌లో భారీ చిత్రం (Movie) రానుంది. వీరి ఇరువురు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.ఈ బిగ్ బడ్జెట్ సినిమాను సన్ పిక్చర్స్ (Sun Pictures) అధినేత కళానిధి మారన్ రూ. 800 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.ఈ చిత్రాన్నికి సంబంధించి ఓ చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా సంచలనం సృష్టించింది. అనౌన్స్ చేసినప్పటి నుంచి మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.
మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నటీనటుల ఎంపిక కోసం వేట కొనసాగుతుండగా.. ఇందులో బన్నీ జోడిగా ఇద్దరు స్టార్ హీరోయిన్‌లను తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్. బాలీవుడ్ బ్యూటీలు జాన్వీ కపూర్, దిశా పటానీతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.ఈ ఇద్దరూ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ హీరోయిన్స్ కాగా, వారి గ్లామర్ అండ్ ఫ్యాన్ బేస్‌ను బట్టి సెలెక్షన్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరి పేర్లపై అధికార ప్రకటన వెలువడనుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించి మిగతా నటీనటుల ఎంపిక పనులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇకపోతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తెలుగులో అట్లీ చేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం.