Homebreaking updates newsHariHara VeeraMallu : హరిహర వీరమల్లు మూవీ మరోసారి వాయిదా?

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు మూవీ మరోసారి వాయిదా?

భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) జంటగా నటిస్తోన్న చిత్రం “హరిహర వీరమల్లు” (HariHara VeeraMallu). పీరియాడిక్ డ్రామా (Periodic Drama)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై.. ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై భారీ బజ్‌ను సృష్టించాయి.
ఈ సినిమాను మొదటగా ఈ ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ అప్పటివరకు షూటింగ్ పూర్తికాకపోవడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. అనంతరం మే 9న విడుదల చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మే 9న కూడా ఈ చిత్రం విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన షాట్స్ పెండింగ్‌లో ఉన్నాయని.. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ పూర్తికావడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
 ఇప్పటికే పలు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో మేకర్స్‌కే స్పష్టత లేకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు రిలీజ్ డేట్‌కి పట్టుమని 23 రోజులే ఉంది. ఇంత షార్ట్ టైమ్‌లో అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలంటే అయ్యే పనికాదని మేకర్స్ భావిస్తున్నారట. మరోసారి ఈ సినిమా వాయిదా పడటం ఖాయమని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. రిలీజ్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తే కానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments