భారత్ సమాచార్.నెట్: గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్(Ram Charan) హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). చెర్రీ 16వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahaman) సంగీతం అందిస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన నిమిషం నిడివి ఉన్న గ్లింప్స్ అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్.. ముఖ్యంగా ఆఖర్లో ఆయన షాట్ కొట్టిన విధానం మెగా ఫ్యాన్స్‌తోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్‌తోనూ చప్పట్లు కొట్టించింది. ఈ గ్లింప్స్‌తో ‘పెద్ది’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సంబంధించి ఓ చిన్న షెడ్యూల్ మౌలాఅలీ రైల్వే స్టేషన్‌లో పూర్తయింది. ఈ పార్ట్‌లో జగపతిబాబు, సత్యల మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రికరించారు.
అయితే ఈ షెడ్యూల్‌లో కథకి చాలా ముఖ్యమైన సీన్లను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సీన్స్ సనిమాకే హైలట్‌గా నిలవనున్నాయట. ఈ వార్త తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటారని తెగ సంబర పడిపోతున్నారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పుట్టినరోజు అంటే మార్చి 27 2026 నాడు రిలీజ్ కానుంది.