Homebreaking updates newsAmit Shah: అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ 

Amit Shah: అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ 

భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్‌కు చెందిన పౌరుల (Pakistan Citizens) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) మరింత కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేంద్ర హోం మంత్రి (Minister of Home Affairs) అమిత్‌ షా (Amit Shah) దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో (All State’s CM’s) ఫోన్‌ చేశారు. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారత్ మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంలో దౌత్య సంబంధాలు రద్దు చేసింది. ఇండియాలో పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలు తమ పరిధిలోని పాక్ పౌరులపై నజర్ పెట్టారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో పాకిస్తానీయులపై పోలీసులు దృష్టి సారించారు. నగరంలోని పాక్ పౌరుల వివరాలు సేకరించారు. హైదరాబాద్‌లో మొత్తం 208 మంది పాకిస్థానీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు తెలిసింది. ఈ విదేశీయులను రెండు రోజుల్లో భారతదేశం విడిచి వెళ్ళాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త నెలకొన్న వేళ దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments