Homebreaking updates newsCaste Name Change: తెలంగాణలో మారనున్న బీసీ కులాల పేర్లు

Caste Name Change: తెలంగాణలో మారనున్న బీసీ కులాల పేర్లు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లోని బీసీ కమ్యూనిటీల్లో (BC Community)ని అనేక కులాలు ఉన్నాయి. అయితే ఇందులో ఆరు కులాల పేర్లు (Caste Names) త్వరలో మారనున్నాయి (Changes). కొన్నేళ్లుగా తమ కులాల పేర్లను దుర్వినియోగం చేస్తున్నారని గ .. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ అభ్యంతరకరంగా వాడుతున్నారని ఆయా కులాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కులాల పేర్లు మార్చాలంటూ వారు చేస్తున్న డిమాండ్‌పై తాజాగా తెలంగాణ బీసీ కమిషన్ స్పందించింది. వారి విజ్ఞప్తి మేరకు ఆయా కులాల పేర్లు మార్చేందుకు కమిషన్ అంగీకరించింది.

 

తమ కులాల పేర్లు మార్చాలని అడుగుతున్న వాటిలో మొదటిది ‘దొమ్మర’. రెండవది ‘పిట్చిగుంట్ల’ కమ్యూనిటీ. మూడవది ‘తమ్మాలి’ కమ్యూనిటీ. నాలుగవది ‘బుడబుక్కల’ కమ్యూనిటి. ఐదవది ‘ఆర్య క్షత్రియ’ కమ్యూనిటి. ఆరోవది ‘వీరముష్టి’ కమ్యూనిటి. అయితే వీటిలో కొన్ని కమ్మూనిటీలు వారి కులం పేర్లు మార్చమని కోరగా.. తమ్మాలి కమ్యూనిటీ మాత్రం.. తమ కుల ధ్రువీకరణ పత్రంలో నాన్‌బ్రాహ్మిణ్, శూద్ర అనే పేర్లు పేర్కొనడంతో.. ఈ పేర్లు వివక్షకు గురిచేసేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. అందుకే తమ కులం పేరును మార్చాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే బీజీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని.. కొన్ని పర్యాయపదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై గతంలోనే తెలంగాణ బీసీ కమిషన్ ప్రజల నుంచి అభ్యంతరాలు కోరింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను సైతం జారీ చేసింది. కొన్ని కులాల పేర్లను సమాజంలో చులకనగా ఉపయోగిస్తున్నారని.. వాటిని మార్చాలని బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే మరోసారి కులాల పేర్లపై స్పందించిన కమిషన్ వాటిని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయా కమ్యూనిటీల అభీష్టం మేరకు పేర్లు మార్చనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments