Homebreaking updates newsRaashii Khanna: సెట్స్‌లో గాయాలపాలైన రాశీ ఖన్నా

Raashii Khanna: సెట్స్‌లో గాయాలపాలైన రాశీ ఖన్నా

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటి (Actress) రాశి ఖన్నా (Raashii Khanna) సెట్స్‌లో స్వల్పంగా గాయపడ్డారు (Injured). అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆమె షేర్ చేశారు. ఓ సినిమా షూటింగ్‌ (Movie Shooting)లో ప్రమాదకరమైన యాక్షన్ సీన్‌లో పాల్గొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అది ఏ సినిమా సెట్ అనేది ఆమె వెల్లడించలేదు. అయితే రాశీ షేర్ చేసిన చిత్రాల్లో రాశి ముక్కు నుండి రక్తం కారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాక, ఆమె చేతులు, కాళ్లపై కూడా గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ మేరకు రాశి ఇలా రాసుకొచ్చారు.. కొన్ని పాత్రలు మనం చేయాలనుకోం.. అవే మన చేత చేయించుకుంటాయి. కొన్ని గాయాలు కేవలం శరీరానికే కాకుండా.. మన ఊపిరి మీద కూడా ప్రభావం చూపగలవు. అయినప్పటికీ, మనం తుఫానులా మారినప్పుడు, ఈ ఉరుములు, మెరుపులు మనల్ని ఆపలేవు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ రాశీ క్యాప్షన్ జోడించింది.

ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీలో రూపొందుతున్న ఫర్జీ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇదే షూటింగ్ సందర్భంగా ఆమెకు ఈ గాయాలు జరిగాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. రాశీ త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందినవారు, ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో తెలుసు కదా సినిమాతో పాటు మరో హిందీ ప్రాజెక్టు కూడా ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments