Homebreaking updates newsKiran Abbavaram: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కిరణ్-రహస్య దంపతులు  

Kiran Abbavaram: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కిరణ్-రహస్య దంపతులు  

భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్ యువ నటుడు (Tollywood Young Actor) కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి అయ్యారు. తన భార్య రహస్య (Rahasya) గురువారం రాత్రి పండంటి మగ బిడ్డ (Baby Boy)కు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతే కాదు ఇందుకు సంబంధించి తన బిడ్డ కాలిని ముద్దాడుతున్న ఫోటోను కూడా కిరణ్ అబ్బవరం షేర్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కిరణ్ అబ్బవరం, నటి రహస్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. తాజాగా బాబు పుట్టినట్లు ప్రకటించారు.
ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. ‘క’ చిత్రంతో గతేడాది భారీ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఇటీవల దిల్ రూబా చిత్రంతో ముందుకు రాగా.. ఆ సినిమా ఆశించిన  స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘కె-ర్యాంప్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు కిరణ్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రహస్య విషయానికి వస్తే పెళ్లైనప్పటి నుంచి ఆమె సినిమాలకి దూరంగా ఉంటునున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments