Homemain slidesStarlink: భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ సేవలు.. కిట్ ధర ఎంతంటే?

Starlink: భారత్‌లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్ సేవలు.. కిట్ ధర ఎంతంటే?

భారత్ సమాచార్.నెట్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు (Satellite Internet Services) భారత్‌ (India)లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మస్క్‌ స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభం కోసం కేంద్ర ప్రభుత్వం (Central Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెలికాం మంత్రిత్వ శాఖ (Ministry of Telecom) నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ లైసెన్స్ (License) పొందింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ చెందిన వన్ వెబ్ తర్వాత భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే మూడో కంపెనీగా మస్క్ స్టార్‌లింక్ నిలవనుంది. లైసెన్స్ లభించిన స్టార్‌ లింక్ త్వరలోనే భారత్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది.
 అయితే భారతీయ వినియోగదారులు స్టార్‌లింక్ సేవలను పొందేందుకు ఎంత ఖర్చు చేయాలి? అని ఆలోచిస్తున్నారు. గతంలో నెలకు రూ.3,000-రూ.7,000 వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేయగా ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లతో ప్రారంభమవుతుందని 10 డాలర్ల కంటే తక్కువగా స్టార్‌లింక్ సేవలను పొందవచ్చని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీలో రూ.810 ప్రారంభ ప్లాన్‌ ఉండే అవకాశం ఉంది. ఇదే తుది ధర కూడా కాదనే తెలుస్తోంది.
ఇక వినియోగదారులు ప్లాన్ ధరతో సంబంధం లేకుండా స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో శాటిలైట్ డిష్, వైఫై రూటర్ ఉంటాయి. ఈ కిట్ ధర రూ.20,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుందని అంచనా. స్టార్‌లింక్ సేవలను యాక్సెస్ చేయడానికి ఒకేసారి పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే ఈ గణాంకాలు ఊహాజనితమైనవి ఎందుకంటే కంపెనీ ఇంకా అధికారికంగా భారతదేశం కోసం దాని తుది ధరల నిర్ణయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
ఇకపోతే ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలకు ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతి రావడం స్టార్‌లింక్‌కు కీలక ముందడుగు అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హై స్పిండ్ ఇంటర్నెట్‌తో భారీ మార్పులు తీసుకురానుంది స్టార్‌లింక్. లో ఎర్త్‌ ఆర్బిట్‌లో వేలాది శాటిలైట్స్‌ ద్వారా 100-200 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్‌ సేవలను అందిస్తుంది. .యూఎస్, యూరప్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే విజయవంతంగా నడుస్తోంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments