Homebreaking updates newsKodali Nani: కొడాలి నాని అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

Kodali Nani: కొడాలి నాని అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన పోలీసులు

భారత్. సమాచార్.నెట్: వైసీపీ (YCP)కి చెందిన పలువురు నేతలు ఇటీవల ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)ని కూడా అరెస్ట్ (Arrest) చేసినట్లు సోషల్ మీడియా (Social Media)లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయనను కోల్‌కతాలో అరెస్టు చేశారంటూ కొన్ని వదంతులు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు (Ap Police) ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు.
కొడాలి నాని అరెస్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న సమాచారాన్ని అవాస్తవం.. గతంలో ఆయనపై నమోదైన కేసులు ఉన్న నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు అన్న వార్త పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కొడాలి నానిని నిజంగా అరెస్ట్ చేస్తే, ఆ వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని.. నిరాధారమైన వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, షేర్ చేయడం నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వదంతుల ప్రచారంలో పాలుపంచుకునే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఏపీ పోలీసులతో పాటు వైసీపీ నేతలు కూడా కొడాలి నాని అరెస్ట్ వార్తలను ఖండించారు. కాగా కొడాలి నాని పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ హయాంలో కొడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పైన కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఇటీవల ముంబైలోని ఓ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES

Most Popular

Recent Comments