Homemain slidesKuberaa: హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న కుబేర.. ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే?

Kuberaa: హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న కుబేర.. ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందంటే?

భారత్ సమాచార్.నెట్: కోలీవుడ్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్, నాగార్జున కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం ‘కుబేర’. ఈ సినిమాకి శేఖర్​ కమ్ముల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు బాషల్లో జూన్​ 20న థియేటర్లలో విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ రెస్పాన్స్ అందుకొని.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది.

మొదటి రోజు ఈ భారీ కలెక్షన్స్​ను సాధించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ. 13 కోట్ల నెట్​ వసూళ్లు సంపాదించింది. ఈ లెక్కన వరల్డ్​వైడ్ గ్రాస్ దాదాపు రెట్టింపు ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళంలోనూ కుబేర డీసెంట్ ఆక్యూపెన్సీతో రన్ అవుతోంది. మరోవైపు కుబేర సినిమా శాటిలైట్​ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్​ స్టార్​ మా అందుకుంది. అలాగే సినిమా ఓటీటీ రైట్స​ను అమెజాన్​ ప్రైమ్​ వీడియోస్​ సంపాదించుకుంది. బ్రాడ్​కాస్ట్​, ఓటీటీ హక్కులు దాదాపు రూ. 65 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.
ఇకపోతే ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న వంటి స్టార్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి వర్క్ చేశారు. అలాగే వివిధ లోకేషన్లలో షూటింగ్ చేశారు. రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందించారు.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరించారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments