భారత్ సమాచార్.నెట్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే పలువురు ఈ విషయంపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలసిందే. తాజాగా ఈ పిటిషన్‌లపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్లు, ఎన్నికల సంఘం తమ వాదనలు వినిపించాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించి తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
గతంలో జరిగిన విచారణల్లో గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకెప్పుడు ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రశ్నించింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకా ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు మరో అరవై రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వం తమ ప్రక్రియ పూర్తి చేస్తే తాము ఎన్నికల నిర్వహణకు ముందుకెళతామని ఈసీ స్పష్టం చేసింది.
2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. పదవీకాలం ముగిశాక ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా విచారణ సందర్భంగా ఇప్పుడు మరో రెండు నెలల గడువు కావాలని హైకోర్టును కోరడంతో.. స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Share This Post