Homebreaking updates newsTrisha: డేటింగ్ రూమర్ల వేళ.. త్రిష పోస్ట్ వైరల్

Trisha: డేటింగ్ రూమర్ల వేళ.. త్రిష పోస్ట్ వైరల్

భారత్ సమాచార్.నెట్: త్రిష.. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. వర్షం సినిమాతో తెలుగు తెరపై పరిచయం అయిన త్రిష.. 41 ఏళ్ల వయసులోను ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో.. వరుస సినిమాల్లో నిటిస్తూ కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో హిట్స్ అందుకుంది. అలాగే ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఇక త్రిష పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వార్తలపై అటు అమె కానీ.. ఇటు విజయ్ కానీ స్పందించకపోవడంతో.. ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది.
ఇటీవల విజయ్ పుట్టిన రోజు సందర్భంగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. “హ్యాపీ బర్త్ డే బెస్ట్ఎస్ట్” అని క్యాప్షన్ పెట్టి, దానికి హగ్, ఈవిల్ ఐ ఎమోజీలను కూడా జోడించింది. ఈ ఫొటోలో విజయ్ త్రిష పెంపుడు కుక్క’ఇజ్జీ’తో ఆడుకుంటుండగా.. పక్కనే కూర్చున్న త్రిష  విజయ్ వైపు చూస్తూ ఉంది. త్రిష..  విజయ్‌తో ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో త్రిష పోస్ట్  వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లను మరోసారి తెరపైకి తెచ్చింది. ఏదేమైనా త్రిష పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments