Homemain slidesRashmika Mandanna: యోధురాలిగా నేషనల్ క్రష్.. రేపే టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్

Rashmika Mandanna: యోధురాలిగా నేషనల్ క్రష్.. రేపే టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్

భారత్ సమాచార్.నెట్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. పాన్ ఇండియా స్థాయిలో టాప్ హీరోయిన్‌గా వరుస హిట్స్‌తో దూసుకెళ్తోంది. హీరోలకు దీటుగా స్టార్ డమ్ సంపాదించుకుంది. అప్పటి పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేరా ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం కుబేర మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ తన తర్వాత ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ రేపు ఉదయం (జూన్ 27) 10.08 గంటలకు రివీల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రష్మిక పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో రష్మిక అందిరిపోయింది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు పోస్టర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ఈ పోస్టర్‌లో రష్మిక ఒక యోధురాలిగా కనిపిస్తోంది. “Wounded… Unbroken.. Warrior.” అంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో చేతిలో బళ్లెం పట్టుకుని ఉండగా.. ఆమెకు ఎదురుగా కొంతమంది వ్యక్తులు వెంబడిస్తున్నట్లు రావడం.. పక్కనే చెట్టు దగ్ధం కావడం హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా రేపు రివీల్ చేయనున్న క్రమంలో రష్మిక ఫ్యాన్స్‌కు సవాల్ విసిరారు. ఈ సినిమా టైటిల్‌ను కరెక్ట్‌గా గెస్ చేస్తే తానే వచ్చి వారిని కలుస్తానని చెప్పారు. ఇకపోతే ఈ బ్యూటీ చేతీలో ప్రస్తుతం ‘థామా’ అనే హారర్-కామెడీ, ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే రొమాంటిక్ డ్రామా, ‘రెయిన్ బో’ అనే చిత్రాలు లిస్ట్‌లు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments