August 8, 2025 7:02 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

అన్నారంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తిన‌ష్టం

భార‌త్ సమాచార్.నెట్, సంగారెడ్డి: హైదరాబాద్ శివారులోని అన్నారం గుబ్బ కోల్డ్ స్టోరేజ్ సెంటర్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వేగంగా కోల్డ్ స్టోరేజ్ మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సిబ్బంది తెలిపారు. అయితే, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ సెంటర్‌లో ఆహారం, విత్తనాలు, ఔషధాలు, వ్యాక్సిన్‌ల నిల్వ కోసం సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో కూలింగ్ సిస్టమ్, ఇతర విలువైన ఇన్ఫ్రా స్ట్రక్చర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

TG High Court: సిగాచీ ప్రమాదంపై రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Share This Post