భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: గత నాలుగు రోజులుగా నాగార్జున సాగర్ నుంచి వస్తున్న జలాలతో రామతీర్థం రిజర్వాయర్ నిండు కుండలా మారింది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 85 మీటర్లు కాగా, ప్రస్తుతం 83 మీటర్లకు చేరుకుంది. మరో రెండు మీటర్లు చేరితే రిజర్వాయర్ నిండిపోతుంది. బుధవారం రిజర్వాయర్‌కు 1,125 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో వస్తోంది. ఇదే ప్రవాహం మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ జలాలను నిల్వ చేసుకునే ఉద్దేశంతో దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. దీనితో ఆయకట్టు కింద ఖరీఫ్ సాగు ఊపందుకోనుంది. ఈ పరిణామం రైతాంగానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పంటకు సరిపడా నీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని కథనాలు