భారత్ సమాచార్.నెట్, వరంగల్: ఆటో బోల్తా పడడంతో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి ప్రాంతానికి చెందిన అజ్మీరా బేగం (40) దూపకుంట మైనార్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. బుధవారం విధులు ముగించుకొని మరో ముగ్గురు ఉపాధ్యాయురాళ్లతో కలిసి ఆటోలో వస్తుండగా శంభునిపేట గిరిప్రసాద్‌నగర్ వద్ద రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజ్మీరా బేగంను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఉపాధ్యాయురాలు ఆఫ్రీన్ స్వల్ప గాయాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజ్మీరా బేగానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరిన్ని కథనాలు