HomeUncategorized‘గేమ్ చేంజర్’లో సాయిపల్లవి?

‘గేమ్ చేంజర్’లో సాయిపల్లవి?

భారత్ సమాచార్,సినీ టాక్స్ : టాలీవుడ్ మరో క్రేజీ, రేర్ కాంబినేషన్ రాబోతుందా.. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెస్టిజీయస్ మూవీస్ తో తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తున్నాడనేది తెలిసిందే. వచ్చే ఏడాది శంకర్ డైరెక్షన్ లోని ‘గేమ్ చేంజర్’ రిలీజ్ కానుండగా.. ఇంతలోనే ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్నిమెగా పవర్ స్టార్ కు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రహమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ సాఫీగా నడుస్తున్నాయి.

సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తుడటంతో నిర్మాతలు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. సాంకేతిక నిపుణులతో పాటు క్రేజీ కాంబినేషన్లను ప్లాన్ చేస్తున్నారు. అందుకే చరణ్ కు జోడిగా ఎవరూ ఊహించని హీరోయిన్ ను సెలక్ట్ చేయాలని చూస్తున్నారట. మొదట్లో శ్రీలీల పేరు వినపడ్డా కూడా ఇప్పుడు చరణ్ కు జోడిగా సాయిపల్లవిని తీసుకుంటున్నారని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాలో సింగిల్ హీరోయినా? ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

రామ్ చరణ్ వంటి మాస్ ఫాలోయింగ్, గ్లోబల్ స్టార్ డమ్ ఉన్న హీరోకు అందాలు ఆరబోసే హీరోయిన్ కాకుండా యాక్టింగ్ ఓరియంటెడ్ సాయిపల్లవిని ఎంపిక చేశారనే విషయం కూడా విశేషమే. అయితే కథ డిమాండ్ ను బట్టి చేస్తుండవచ్చు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments