Homeతెలంగాణజాబ్ క్యాలెండర్ ఓకే..నిరుద్యోగులకి ఎన్నెన్నో డౌట్లు!

జాబ్ క్యాలెండర్ ఓకే..నిరుద్యోగులకి ఎన్నెన్నో డౌట్లు!

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 13 రోజులకు ముందుగా శుక్రవారం(నవంబర్ 17)న భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ వారి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా నిరుద్యోగులకు పెద్దపీట వేసినట్టే కనిపిస్తోంది. అయితే దీనిపై ప్రజలు, విద్యావంతులు, నిరుద్యోగులు హర్షం, అందులో కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటైన మూడు ప్రధాన ట్యాగ్ లైన్లలో ‘నియామకాలు’ ఒకటి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఏదో ఒక ఉద్యోగం సాధించి తమ బతుకులు బాగు చేసుకుందామని లక్షలాది నిరుద్యోగులు పెద్దు ఎత్తున ఎదురు చూశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిరుద్యోగుల ఆకాంక్షలకు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు  ఉన్నాయి. ఈక్రమంలో 2022లో ఎన్నికల ముందు భారీ స్థాయిలో 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినా.. లీకేజీలు, అవకతవకలతో పాటు కొన్ని పోస్టులకు మాత్రమే ఎగ్జామ్స్ పెట్టి.. మిగతా నోటిఫికేషన్ల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ పై నిరుద్యోగులు అగ్గిగుగ్గిలంలా మండిపడ్తున్నారు. దీంతో నిరుద్యోగులను తనవైపునకు తిప్పుకునేలా కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో నిన్న కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో లో కూడా నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించింది.

మ్యానిఫెస్టోలో వివిధ పోస్టుల నోటిఫికేషన్ల డేట్లను సైతం ప్రకటించి నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా వ్యవహరించింది. అధికారంలోకి వస్తారో రారో పక్కన పెడితే ఆ ప్రయత్నం మంచిదే. ఎందుకంటే రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన వర్గాల్లో నిరుద్యోగులదే ప్రథమ స్థానం. అయితే నోటిఫికేషన్ల డేట్లు ప్రకటించిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ వేసిన 80వేల పోస్టులను ఏం చేస్తుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎగ్జామ్స్ పెట్టిన వాటి ఫలితాలు ఇస్తుందా? లేదా అని కూడా క్లారిటీగా చెప్పలేదు.

ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. మరి దానిపై ఏ నిర్ణయం తీసుకుంటారు. కొత్త నోటిఫికేషన్ అంటే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారా? లేక మరిన్ని పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారా అనేది చెప్పలేదు. అలాగే గ్రూప్-2 పరీక్షను జనవరి 7,8 తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మరి దాన్నేం చేస్తారు? కొత్త గ్రూప్-2 ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామంటున్నారు. ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలు నిరుద్యోగుల మదిలో మెదులుతున్నాయి. వీటన్నంటికీ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments