Homebreaking updates newsమరో సైకాలజికల్ థ్రిల్లర్ లో కంగనా

మరో సైకాలజికల్ థ్రిల్లర్ లో కంగనా

భారత్ సమాచార్, సినీ టాక్స్ :  బాలీవుడ్ ప్రముఖ నటి, కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పేరు ఈ మధ్య సినిమాల్లో కంటే దేశ రాజకీయాల్లోనే ఎక్కువ నానుతుంటోంది అంటే అందులో ఎటువంటి సందేహం లేదు మరి. హిందూ జాతీయ వాదానికి సపోర్ట్ గా తరుచూ కామెంట్స్ చేస్తూ, ఇతరులకు కౌంటర్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటోంది. ఈమె తెలుగులో ప్రభాస్ సరసన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఏక్ నిరంజన్’ మూవీతో తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మొదట్లో బోల్డ్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా.. ఇంకా తన నటనతో, హాట్ అందాలతో ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతానికి లేడీ ఓరియాంటెడ్ మూవీస్ తో  పాటు యాక్టింగ్ బేస్ ఎక్కువున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ నటిస్తోంది.

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి మరి సినిమాలు చేస్తోంది ఈ కర్లీ హెయిర్ బ్యూటీ. మొన్ననే తమిళ నటుడు లారెన్స్ తో చేసిన చంద్రముఖి సీక్వెల్ మూవీ రిలీజ్ అయి ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. అయినా ఇవన్నీ పట్టించుకోని అమ్మడు వరుసగా సినిమాలకు సైన్ చేస్తూనే ఉంది. ఇదే కోవలో ప్రముఖ నటుడు మాధవన్ కీలకపాత్ర పోషిస్తున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో చాన్స్ కొట్టేసింది. దీనిలో ఆమెదే ప్రధాన పాత్ర అని మూవీ మేకర్స్ అంటున్నారు.

మాధవన్ , కంగనా కాంబినేషన్ లో గతంలో ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. మళ్లీ  8 ఏండ్ల తర్వాత ఈ జంట వెండితెరపై కనువిందు చేయనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఏ ఆర్ రెహ్మాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో తలైవా రజినీకాంత్ ను కలిసి కంగనా బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఈ హిట్ కాంబో మళ్లీ సక్సస్ అందుకుంటుదా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొంత కాలం సినీ ప్రేక్షకులు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments