Homemain slidesమహారాష్ట్ర గ్రామాలను తెలంగాణలో కలుపుతా.. కేసీఆర్

మహారాష్ట్ర గ్రామాలను తెలంగాణలో కలుపుతా.. కేసీఆర్

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఓటర్లపై అన్ని రాజకీయ పార్టీల హామీల వరద కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ మ్యానిఫెస్టోలను ఎన్నికల ప్రచారంలో భాగంగా రిలీజ్ చేశాయి. తాము గెలిస్తే ఏం చేస్తామో..అనే విషయాలపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలే కాకుండా స్థానికంగా ఉండే సమస్యలపై కూడా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నేతలు ఎక్కడికి వెళ్లినా అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి కూడా హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అలాంటి వరాతోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

18వ తారీఖు చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాగానే మహారాష్ట్రపై దృష్టి సారిస్తానని తెలిసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తనపై లఫంగ దందాకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఆ రాష్ట్రంలోని 150 గ్రామాలను తెలంగాణలో కలపడానికి రెడీగా ఉన్నందునే ఆ పార్టీలు తమను గెలవనివ్వకుండా కుట్రలు పన్నుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పార్టీలు తనను చూసి భయపడుతున్నాయని, అందుకే బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుపడాలని చూస్తున్నాయన్నారు.

కాగా, రాజకీయంగా దేశ స్థాయిలో చక్రం తిప్పాలని.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పార్టీ పేరును బీఆర్ఎస్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మహారాష్ట్ర తెలంగాణ రాష్టానికి పొరుగు రాష్ట్రం కావడం.. అక్కడ తీవ్ర స్థాయిలో రాజకీయ అనిశ్చితి ఉండడంతోనే ఆయన మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొన్ని పంచాయతీలను కూడా గెలుచుకుంది. దీంతో అక్కడ పాగా వేయాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. అందుకే మహారాష్ట్ర గ్రామాలను తెలంగాణలో కలుపుతానని వాగ్దానాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments