Homemain slidesమనకు ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?

మనకు ఓటు హక్కు ఎలా వచ్చిందో తెలుసా?

భారత్ సమాచార్, రాజకీయం : ఓటు హక్కు.. ప్రజాస్వామ్య దేశంలో పౌరుల చేతిలో ఉన్న వజ్రాయుధం. మంచి నేతల పాలిట ఐరావతం, నియంత పాలకులపై సంధించే బ్రహ్మస్త్రం.  ప్రజాస్వామిక పాలనకు ఓటు హక్కే ఆయుధం. రాజరికా ప్రభుత్వాలను కూల్చి.. ప్రజా ప్రభుత్వాలను నిలబెట్టిన ఘనత ప్రజా ఓటుదే. అసలు మనకు ఓటు హక్కు అనేది ఎలా వచ్చిందో  ప్రజలకే కాదు. చాలా మంది ప్రజాప్రతినిధులకూ కూడా తెలియదు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన వజ్రాయుధం ఓటు హక్కు ప్రజలకు ఎలా లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటీష్ వారి పరిపాలనలోనే కొద్ది మందికి ఓటు హక్కును ప్రవేశపెట్టారు. కానీ అందరికీ ఓటు హక్కు అనేది ఒక్క రోజులో జరగలేదు. కాలక్రమేణా వచ్చింది ఈ అవకాశం. దానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. 1907 బ్రిటిష్ భారతదేశంలో  స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆ సందర్భంగా బ్రిటీష్ ప్రభుత్వం వేసిన ‘రాయల్ కమిషన్’ సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్ చట్టం ప్రాతిపదికన భారతీయుల్లో కొద్దిమందికే తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ప్రవేశపెట్టారు. పన్ను కట్టిన సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. మహిళలకు, పేదలకు, వెనకబడిన, అణగారిన వర్గాల వారికి ఓటు హక్కును ఇవ్వలేదు. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మరింత మందికి కల్పించారు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా 28.5 శాతం ప్రజలకు ఓటు హక్కును అందించారు.

భారత పౌరులందరికీ ఓటు హక్కును అందించకుంటే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లదని తెలిసి రాజ్యాంగంలో 326వ ఆర్టికల్ చేర్చి.. మొదటగా 21 సంవత్సరాలు నిండిన భారత పౌరులు అందరికి ఓటు హక్కును కల్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలె రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు కుదించారు. ఇలా ఓటుహక్కు ను ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకునే అవకాశం రాజ్యాంగం ద్వారా కల్పించారు. ప్రస్తుతం నేటి ఎన్నికల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి భారత పౌరుడు కూడా తన ఓటుహక్కు ద్వారా ప్రజాస్వామ్య క్రతువులో పాలుపంచుకుంటున్నాడు. తమకు నచ్చిన పాలకులను ఎన్నుకుంటున్నాడు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు...

మన దేశ చట్టాల్లో ఐదు ఆసక్తికరమైన అంశాలు…

RELATED ARTICLES

Most Popular