భారత్ సమాచారం, సినీ టాక్స్ : పుష్ప మూవీ ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. ఆ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేయడమే కాకుండా బన్నీలోని నటనావిశ్వరూపాన్నిసినీ ప్రేమికులకు శాంపిల్ చూపింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టింది. అందుకే పుష్ప మూవీ బన్నీ ఫిల్మ్ లైఫ్ లో ఓ మైల్ స్టోన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టైలీష్ స్టార్ కు ఉన్న ఇమేజ్ ను చూసి ఆయన సరసన నటించాలనే కోరికను చాలామంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా బయటపెట్టేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వం, జోవియాల్టీ, హర్డ్ వర్క్ నెస్.. ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హై నెస్ ను పెంచేవే. తాజాగా ముద్దుగుమ్మ సీరత్ కపూర్ బన్నీపై ఉన్న అభిమానాన్ని మీడియా ముఖంగా చాటుకుంది.
సీరత్ కపూర్ టాలీవుడ్ కథానాయకుడు శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన కథానాయిక. ఆ తర్వాత కూడా అడపాదడపా కొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా బన్నీతో సీరత్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో బన్నీతో సీరత్ నటిస్తున్నట్టు మీడియాలో వార్తలు కూడా హల్ చల్ చేశాయి. పుష్ప-2లో ఐటెం సాంగ్ లో బన్నీ తో కలిసి స్టెప్పులు వేయనున్నట్టు టాలీవుడ్ టాక్. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు కనపడిన వారిలో నన్ను ఆకర్షించిన వ్యక్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… తనలో ఓ స్పార్క్ కనిపిస్తోంది నాకు. అది ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. బన్నీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో నేనూ కూడా ఉన్నాను.. తనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా..’’ అంటూ మీడియా ముందు హోయలు పోయింది ఈ బ్యూటీ గర్ల్.