Homebreaking updates newsఅలాగైతే పెళ్లి క్యాన్సిల్... కత్రినా బెదిరింపు

అలాగైతే పెళ్లి క్యాన్సిల్… కత్రినా బెదిరింపు

భారత్ సమాచార్, సినీ టాక్స్ : కత్రినా కైఫ్ అందానికి గాయపడని సినీ ప్రేమికుల మనసు ఉండదు. ‘మల్లీశ్వరి’ సినిమాలో యువరాణిగా ఈ బాలీవుడ్ బ్యూటీ కరెక్ట్ గా సరిపోయింది. మొదట్లో కాస్త ఈ బ్యూటీడాల్ సినిమాలు యావరేజీగా నడిచినా.. తర్వాత సల్మాన్ భాయ్ తో నటించడంతో ఆమె అదృష్టమే మారిపోయింది. అందాల భామగా సినిమాల్లో రాణిస్తూనే బాలీవుడ్ టౌన్ లో పెద్ద ఎత్తున లవ్ ట్రాక్ లు  కూడా నడిపిందని బాలీవుడ్ సర్కిల్ లా టాక్. చివరకు ప్రముఖ హిందీ కథానాయకుడు విక్కీ కౌశల్ తో 2021లో సింపుల్ గా అత్యంత సన్నిహితుల మధ్య గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ను చేసుకుంది ఈ బ్యూటీ.

వివాహం తర్వాత కూడా ఇద్దరూ సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ‘సామ్ బహదూర్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విక్కీ కౌశల్.. ఓ ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ తనను బెదిరించిన తీరుపై వివరించాడు.

పెళ్లైన రెండు రోజులకే షూటింగ్ లో పాల్గొనాలని మేకర్స్ ఫోన్ చేయడంతో వెళ్లేందుకు రెడీ అయ్యానని తెలిపాడు. వెంటనే రియాక్ట్ అయిన కత్రిన.. అలా అయితే వెడ్డింగ్ క్యాన్సిల్ చేసుకుంటానని బెదిరించిందని విక్కీ సరదాగ చెప్పుకొచ్చాడు. దీంతో భయపడిపోయి షూటింగ్ కు వెళ్లకుండానే ఇంటి వద్దే ఆగిపోయానన్నాడు. 5 రోజుల తర్వాత మళ్లీ భార్య కత్రినా పర్మిషన్ తీసుకొని మరీ షూటింగ్ కు వెళ్లానని ఇంటర్వ్యులో చెప్పుకొచ్చాడు. ఇంట్లో కత్రినాతో సినిమాల గురించి, స్క్రిప్ట్ ల గురించి డిస్కస్ చేస్తావా? అని అడిగితే.. తమ మధ్య వాటి చర్చే అస్సలు రాదని చెప్పాడు. ఒకే ప్రొఫెషన్ లో ఉన్న ఇద్దరం.. ఆ విషయాల గురించి మాట్లాడుకోవచ్చు.. కానీ ఆ సందర్భాలు రావని, అందుకే సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నామని అంటున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments