Homebreaking updates news‘మన్నారా’కు సపోర్ట్ చేయని పరిణితి

‘మన్నారా’కు సపోర్ట్ చేయని పరిణితి

భారత్ సమాచార్, సినీ టాక్స్ : రాజకీయాల్లో గాని, బిజినెస్ లోగాని, సినిమాల్లోగాని.. మరేదైనా ఫీల్డ్ లో కానీ తమవారే ఉండాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు. డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం, యాక్టర్ కొడుకు యాక్టర్ కావడం, పొలిటిషియన్ కొడుకు పొలిటిషియన్ కావడం సహజం. అలాగే ఒక రంగంలో ఎవరైనా ఉన్నారంటే.. అందులోకి తమ పరివారాన్ని అంతా కూడా అందులోకి తీసుకురావడం అనేది చాలా కామన్. అయితే నేటి తరంలోకి కొందరు మాత్రం ఎందుకనో వీటిని అంగీకరించరు. వారి కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉండడం.. లేదంటే తమ కుటుంబంలో తామే సెలబ్రిటీలుగా ఉండాలని కోరుకోవడం.. లాంటి ఉంటేనే తమ వారిని ప్రోత్సహించరు. అచ్చంగా ఇలాంటిదే బాలీవుడ్ లో మన్నారా చోప్రా, పరిణితి చోప్రా మధ్య జరుగుతుందా అని సినీ జనాలకు పెద్ద డౌట్ గా మారింది. మన్నారా, పరిణితి, ప్రియాంక చోప్రా వీరంతా చాలా దగ్గరి బంధువులని వారిని ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది.

మన్నారా చోప్రా హీరోయిన్ గా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే అంతగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ 17లో కంటెస్టంట్ గా ఎంటరైంది. ఈమెను చూస్తే ఎవరైనా బబ్లీ అండ్ బ్యూటీఫుల్ గర్ల్ అనేస్తారు. ఈ క్రమంలోనే ఈమెను బిగ్ బాస్ లో సపోర్ట్ చేయడానికి తన కజిన్ పరిణితి చోప్రా పేరుతో సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజేస్ హల్ చల్ చేస్తున్నాయి. మన్నారాకు పరిణితి సపోర్ట్ చేస్తున్నట్టు అందులో పేర్కొంటున్నాయి. అయితే తాను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని, తన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ పేజీలేనని పరిణితి చోప్రా ఇటీవల పోస్ట్ చేయడంతో మన్నారా అభిమానులంతా కంగుతిన్నారు. ఒక ఇంటికి చెందిన వారే ఇలా సపోర్ట్ చేసుకోకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రానే మన్నారా కు సపోర్ట్ చేసింది.. పరిణితి ఇలా చేయడమేంటని పోస్టులు పెడుతున్నారు. ఒకే ఇంటి అమ్మాయిలకు ఐకమత్యం లేకుంటే ఎలా అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

నా భర్త నన్ను వేధించట్లేదు… అలియా

RELATED ARTICLES

Most Popular

Recent Comments