భారత్ సమాచార్, సినీ టాక్స్ ; బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రూ.1000 కోట్ల క్లబ్ లో తన గత రెండు సినిమాలు ఉండడం వెండితెరపై షారుఖ్ బాక్సాఫీస్ సత్తాను చాటాయి. ఇక ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఈ బాలీవుడ్ బాద్ షా నటించిన చిత్రం ‘డుంకీ’ తో ఈ డిసెంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. షారుఖ్ సినిమాలతో పాటుగా తన కుటుంబానికి కూడా చలా ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం అందిరికి తెలిసిందే. తన కొడుకు, కూతురు కెరీర్ పై కూడా వాళ్ల ఇష్టప్రకారమే నడుచుకొమ్మని చెప్పాడట. ఇక షారుఖ్ గారాలపట్టి సుహానా ఖాన్ ‘‘ది ఆర్చీస్’’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. జోయా అక్తర్ డైరెక్షన్ లో త్వరలోనే రాబోతున్న ఈ మూవీలో సుహాన కీలక పాత్రలో కనిపిస్తుందట. ఈ సినిమా ప్రమోషన్ కోసం సుహాన ఇప్పటి నుంచే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ యంగ్ బ్యూటీ తన గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తనను తాను ఓవర్ థింకర్ గా మీడియా ముందే ప్రకటించుకుంది. ఆందోళనతో కూడిన వ్యక్తినేనని కూడా తెలిపింది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఏం చేస్తావని ప్రశ్నించగా.. ‘‘వర్కవుట్ చేయడం ఫిజికల్ గా కన్నా మెంటల్ గా ఎక్కువ హెల్ప్ అవుతుంది అని చెప్పుకొచ్చింది. చిన్న చిన్న విషయాలకే కొన్నిసార్లు యాంగ్జయిటీ గా ఫీల్ అవుతుంటాను అని తెలిపింది. మొత్తంగా ఓవర్ గా ఆలోచిస్తుంటాను. అలాంటప్పుడు జిమ్ కు వెళ్లి గంటపాటు కష్టపడితే అంతా సెట్ అయిపోతుంది.’’ అని తెలిపింది. ఇలా పర్సనల్ లైఫ్ ను చెపుతూ ఆడియన్స్ కు దగ్గర కావడానికి సుహాన ప్రయత్నం చేస్తోంది. తాను నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తోంది. ఇక షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరో వారసురాలు తెరంగ్రేటం చేయనుండడంతో .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని వారు కూడా కోరుకుంటున్నారు.
మరికొన్ని సినిమా సంగతులు మీ కోసం…