Homemain slidesరేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది

రేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది

భారత్ సమాచార్, సినిమా: శ్రీదేవి, రేఖ.. ఈ ఇద్దరూ సౌత్ నుంచి బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్లు. వీరిద్దరూ తమ అందంతో, అభినయంతో బాలీవుడ్ లో నటించి దేశం మరిచిపోలేని నటీమణులుగా ఎంతో పాపులర్ అయ్యారు. శ్రీదేవి తెలుగు, సినిమాల్లో టాప్ హీరోయిన్ గా రాణించి బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యారు. రేఖ సౌత్ లో కొన్ని సినిమాల్లో నటించినా.. బాలీవుడ్ లో శ్రీదేవి కంటే ఎక్కువ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఈ ఇద్దరూ అందగత్తెలతో నటించాలని అప్పటి బాలీవుడ్ హీరోలు పోటీ పడేవారు. అయితే శ్రీదేవిని హిందీలో ప్రమోట్ చేసింది మాత్రం రేఖ కావడం విశేషం.

శ్రీదేవి కెరీర్ లోనే మరిచిపోలేని సినిమా చాందిని. 1989లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ హిట్. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాందినీ..ఓ మై చాందినీ.. అంటూ ఈ మూవీ దేశాన్ని ఊపేసింది. పెద్ద హిట్ గా నిలిచిన ఈ మూవీలో శ్రీదేవి చాన్స్ ఇప్పించింది మాత్రం రేఖనే. యశ్ చోప్రా రూపొందించిన ఈ మూవీలో చాందిని పాత్రకు మొదట రేఖను అనుకున్నారట. ఈ సినిమాకు ముందు అమితాబ్, రేఖ, జయ బచ్చన్ కాంబోలో ‘సిల్ సిలా’ మూవీని యశ్ చోప్రా తెరకెక్కించారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో రేఖ పేరు చాందిని. అయితే యశ్ చోప్రా.. చాందిని పేరుతో సినిమా తీస్తున్నట్టూ.. ఆ పాత్రకు మొదటగా రేఖను అడిగారట. అయితే ఆ పాత్రలో తనకంటే శ్రీదేవి బాగా సూట్ అవుతుందని చెప్పి యశ్ చోప్రాకు రేఖ సిఫార్సు చేసింది. దీంతో చాందిని మూవీలోకి శ్రీదేవి ఎంటరైంది. ఈ మూవీతో బాలీవుడ్ లో శ్రీదేవి నంబర్ వన్ స్టార్ అయ్యింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు పేరు రావడంతో పాటు బెస్ట్ పాపులర్ మూవీగా జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది.

మరికొన్ని సినీ సంగతులు…

ప్రభాస్- అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయిందట!

RELATED ARTICLES

Most Popular

Recent Comments