Homeతెలంగాణకేటీఆర్ ట్వీట్ పై అనసూయ ఎమోషనల్

కేటీఆర్ ట్వీట్ పై అనసూయ ఎమోషనల్

భారత్ సమాచార్, రాజకీయం: బుల్లితెరపై యాంకర్ నుంచి వెండితెరపై యాక్టర్ గా మారిన అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే కొన్ని సందర్బాల్లో సోషల్ మీడియాలో ఆమె బాగా ట్రోల్ కూడా అవుతోంది. ఆ మధ్య రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో ట్వీట్టర్ వేదికగా జరిగిన వివాదంలో అతడి రౌడీ ఫ్యాన్స్ అనసూయను అంటీ అంటూ సంబోధిస్తూ చాట్ చేయడంపై ఆమె బాహాటంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 40 ఏండ్లకు వచ్చిన ఈ భామకు ఇప్పటికీ కుర్రకారులో ఫుల్ క్రేజ్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టుగానే అనసూయ తన అందాలను ఫొటో షూట్ లు, సోషల్ మీడియా వీడియోల ద్వాారా అందరికీ పంచుతుంటుంది. ప్రస్తుతం వెండితెరపైనే నజర్ వేసిన అనసూయ యాంకర్ గా టీవీకి  దూరం కావడం కొంచెం బాధగా ఉందని కూడా రీసెంట్ గా చెప్పింది.

అనసూయకు సోషల్ మీడియాలో యూత్ నుంచి ఫుల్ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. తెలంగాణకే చెందిన ఈ బ్యూటీకి గతం నుంచే కేసీఆర్, కేటీఆర్ లంటే ప్రత్యేకమైన గౌరవం ఉందని ట్వీట్స్ ద్వారా చెప్పేది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని అంగీకరిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై యూత్ బాగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ పీపుల్, సినిమా, బిజినెస్ పీపుల్ కేటీఆర్ లాంటి మంత్రిని చూడలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ కూడా తన అభిప్రాయాలను ఒక  ట్వీట్ ద్వారా అందరితో పంచుకుంది. ‘‘ మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది తప్పక చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్ సిటీతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేటట్లు చేసినందుకు చాలా ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే గెలిచిన కాంగ్రెస్ నేతలకు అభినందనలు కూడా తెలిపింది.

మరికొన్ని కథనాలు…

‘పవన్ గ్రేట్ లీడర్.. అందుకే ప్రచారానికెళ్తా’

RELATED ARTICLES

Most Popular

Recent Comments