భారత్ సమాచార్,సినిమా: అలనాటి అందాల తార, అభినయ నేత్రి, మహానటి సావిత్రిని మరో వందేళ్లైనా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తెలుగు తెరపై ఆమె రూపం ఏనాటికీ మరిచిపోలేనిది. సావిత్రమ్మగా అందరూ పిలుపుచుకునే గౌరవం ఆమె ఒక్కరికే సాధ్యం. దాదాపు 30ఏండ్లుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఏలిన ఘనతే సావిత్రికే దక్కింది. ఆమె నటించని పాత్ర లేదు. సావిత్రి ఉందంటే చాలు ఆ సినిమా హిట్ అయ్యినట్టేనని నిర్మాతలు భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లకు ధీటుగా నటించిన తొలితరం హీరోయిన్ ఆమె. ఆమె స్టార్ డమ్ వారితో సమానంగా ఉండేది.
సావిత్రి బయోపిక్ ను ‘మహానటి’ పేరుతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈమూవీ సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు జాతీయ అవార్డులను సైతం కొల్లగొట్టింది. ఈ సినిమాను అశ్విన్ ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఒక పల్లెటూరు అమ్మాయి సినిమాల్లో నటించేందుకు మాద్రాస్ కు వెళ్లడం.. చాన్స్ దక్కించుకోవడం.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ తదితరులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. తెరపై మహానటిగా నీరాజనాలు అందుకోవడం.. ఆ తర్వాత జెమినీ గణేషన్ తో ప్రేమ, పెళ్లి.. లైఫ్ లో ఉన్నత స్థితికి చేరడం.. వ్యక్తిగత జీవితం ఫెయిల్ కావడంతో మద్యానికి బానిస కావడం.. సర్వం కోల్పోవడం.. ఇలా జీవితంలో ఎన్నో అటుపోట్లను సావిత్రి ఎదుర్కొంది. వీటన్నంటినీ నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించారు. అయితే సావిత్రి జీవితంలో ఇవే కాకుండా ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వీటిపై ఎన్నో న్యూస్ కూడా చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా సావిత్రి చిరుతపులిని పెంచుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సాధారణంగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటారు. కానీ సావిత్రి జీవితం ఓదశలో రాజవైభవం నడిచింది. ఆటైంలో ఆమె దేన్నైనా శాసించే స్థాయిలో ఉన్నారు. అప్పుడే ఆమె మహారాణిలాగా ఓ చిరుతను పెంచుకుందని చెపుతున్నారు.
మరికొన్ని సినీ సంగతులు…