భారత్ సమాాచార్ ,సినీ టాక్స్ : సినిమా హీరోయిన్ కావడం అంటే అంతా ఈజీ కాదు. మంచి అందంతో పాటు అభినయం ఉండాలి. అలాగే లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలి. ఇండస్ట్రీ నుంచి ఓ సపోర్ట్ దొరకాలి. ఇవన్నీ కుదిరినా జనాలు యాక్సెప్ట్ చేయాలి.. సినిమా హిట్ కావాలి.. ఇలా ఎన్నెన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. అప్పుడే చాన్స్ లు వస్తాయి. హవా నడిచినప్పుడే ఎంతో కొంత వెనకేసుకోవచ్చు. నలుగురైదుగురు హీరోయిన్లు తప్పా మిగతా హీరోయిన్ల కెరీర్ రెండు, మూడు సంవత్సరాలే అని చెప్పవచ్చు. ఇలా వచ్చి అలా వెళ్లే వారే ఎక్కువుంటారు. హీరోయిన్ గా కొనసాగాలన్నా, అందరి దృష్టిలో పడాలన్నా.. మాంచి ఫొటో, వీడియో షూట్ లు చేయాల్సి ఉంటుంది. అలాగే సినిమా ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లకు హాజరుకావాల్సి ఉంటుంది. వీటి కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రీసెంట్ గా హీరోయిన్ల కాస్ట్ లీ మెయింటనెన్స్ గురించి అడల్ట్ ఫిల్మ్ ‘‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బ్యూటిఫుల్ బ్యూటీ భూమీ పెడ్నేకర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పింది. స్టార్ హీరోయిన్స్ ఒక ఫంక్షన్ కు అటెండ్ కావాలంటే, అవార్డు అందుకోవాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పింది. ఓ ఫంక్షన్ లేదా ఈవెంట్ వెళ్లాలంటే మేకప్ అండ్ జ్యువెల్లరీ, కారు.. ఇలా అన్నీ లెక్కేసుకుంటే ఖర్చు లక్షల్లో ఉంటుందని చెప్పింది. ఇక ఆస్కార్ లాంటి ఫంక్షన్లకు హాజరయ్యేవారికి ఖర్చుల మోతే ఉంటుందని వాపోయింది. ఈ భామ చెప్పినట్టే తారల ఖర్చుపై తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు జయలలిత కూడా ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి సంగతులే చెప్పింది. తనకు 700కు పైబడి చీరలు ఉన్నాయని, లక్షల రూపాయల విలువ చేసే వన్ గ్రామ్ గోల్డ్ ఉందని తెలిపింది. సినిమా, సీరియల్ తారలకు ఇవన్నీ తప్పవని, అలా మెయింటెన్ చేస్తేనే అవకాశాలు వస్తాయని చెప్పింది. దీన్ని బట్టి సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఇంత మెయింటెన్ చేస్తే ఇక బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల ఖర్చు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.