HomeUncategorizedటీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్!

టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలో బిగ్ ట్విస్ట్!

భారత్ సమాచార్, రాజకీయం : టీఎస్పీఎస్సీ.. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో మైండ్ గేమ్ ఆడుకున్న సంస్థ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లను ఒక్కదాన్ని సరిగ్గా నిర్వహించలేక బాహాటంగానే అభాసుపాలైంది. లీకేజీలు, అవినీతి, వాయిదాలు.. ఒక్కటేమిటి నిరుద్యోగులను నానా కష్టాలకు గురిచేసి వారి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇంటి దొంగలు చేసిన పని వల్ల లక్షలాది నిరుద్యోగులు మానసిక క్షోభకు, ఆర్థిక కష్టాలకు, నష్టాలకు గురయ్యారు. వారి ఆగ్రహానికి కారణంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం కోల్పోయింది. దాని చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి ఒక్కసారి కూడా నిరుద్యోగులకు నైతిక భరోసా కల్పించలేకపోయారు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 11న రాజీనామా చేయడంతో నిరుద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు సంబరాలు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు వారిని బోర్డు ఛైర్మన్ ఎన్ని తిప్పలు పెట్టారో. ఆయన తన రాజీనామాను గవర్నర్ కి అందజేశారు.

ఆయన రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమని రాజ్ భవన్ వర్గాలు అధికారికంగా నేడు వెల్లడించాయి. పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరో తేల్చకుండా చైర్మన్ రాజీనామాను ఆమోదించవద్దని గవర్నర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనార్దన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ డీవోపీటీకి గవర్నర్ లేఖ రాసినట్టు సమాచారం అందింది. ప్రస్తుతం గవర్నర్ తమిళి సై పుదుచ్చేరిలో ఉన్నారు. ఆమె తెలంగాణకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వేసిన అన్నీ నోటిఫికేషన్లను రీషెడ్యూల్ చేసే యోచనలో ఉంది. ఈ విషయమై నేడు పూర్తిస్థాయిలో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని నిరుద్యోగులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. టీఎస్సీపీఎస్సీ ని ప్రక్షాళన చేసి కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీలైనంత తొందరగా వీటిపై నిర్ణయం తీసుకుని నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరికొన్ని కథనాలు…

కేరళ పీఎస్సీతో పోల్చితే టీఎస్సీపీఎస్సీ తూచ్..

RELATED ARTICLES

Most Popular

Recent Comments