Homeతెలంగాణసినీ ప్రముఖులు రేవంత్ ను ఎందుకు కలవడం లేదు?

సినీ ప్రముఖులు రేవంత్ ను ఎందుకు కలవడం లేదు?

భారత్ సమాచార్, రాజకీయం : తెలుగు సినీ పరిశ్రమకు గత ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని సపోర్టివ్ గా ఉండేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత టాలీవుడ్ ను టార్గెట్ చేస్తారని అందరూ భయపడ్డ.. వాటిని పటాపంచలు చేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినీ పరిశ్రమ వెలుగొందింది. అలాగే పెద్ద సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా అవకాశం ఇచ్చేది. ఇలా సినిమా పరిశ్రమ ఢోకాలేకుండా నడిచింది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు దాటిపోయింది. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకూ సినీ పెద్దలు ఎవరూ సీఎంను కలవడం కానీ, మంత్రిని కలవడం కానీ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల మంత్రిని ఇదే ప్రశ్న అడిగితే.. ఒక్క దిల్ రాజు మాత్రమే తనకు ఫోన్ చేశాడని, తనకు మిగతా వారు ఎవరూ ఫోన్ చేయలేదని, కలవలేదని స్ఫష్టం చేశారు. ఇక రేవంత్ రెడ్డికి చిరంజీవి, నాగార్జున లాంటి వారు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారే తప్ప స్వయంగా వచ్చి కలువలేదు.

దీనిపై సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలుగు పరిశ్రమ హైదరాబాద్ లో సజావుగా సాగాలంటే తెలంగాణ ప్రభుత్వ అండ అవసరం. అలాంటిది సినీ పెద్దలు ఇంతవరకు ప్రభుత్వ పెద్దలను కలువకపోవడం వారికే నష్టం చేకూరే అవకాశం ఉంటుంది కదా అని అంటున్నారు.

మరి ఈ విషయం సినీ పెద్దలకు అర్థం కావడం లేదా.. అని సగటు సినీ అభిమాని అనుకుంటున్నాడు. ఏపీ సీఎంను కూడా అప్పట్లో కలువలేదు. అయితే ఓ కారణముంది..సినీపెద్దల్లో ఎక్కువ మంది ఓ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారికి జగన్ గెలవడం ఇష్టం లేదు కాబట్టి వెళ్లలేదు అనుకోవచ్చు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు.. కదా.. ఇక్కడ కులపట్టింపులు పెద్దగా ఉండవు అనేది అందరికీ తెలిసిందే. మరి సినీ పెద్దలు కలువడానికి ఏం అభ్యంతరమో వారికే తెలియాలి. చూడాలి మరి ఎంతకాలం ఈ గ్యాప్ నడుస్తుందో.

మరికొన్ని కథనాలు...

ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చి

RELATED ARTICLES

Most Popular

Recent Comments