Homemain slidesసెలబ్రిటీల పెళ్లి సందడి...ఈ ఏడాదంతా వేడుకలే

సెలబ్రిటీల పెళ్లి సందడి…ఈ ఏడాదంతా వేడుకలే

భారత్ సమాచార్,సినీ టాక్స్ : ఈ ఏడాదిలో సెల్రబిటీలు చాలా మందే పెళ్లిపీటలు ఎక్కారు. దేశంలోని ప్యాలెస్ లతో పాటు విదేశాల్లోనూ మన సెలబ్రిటీల పెళ్లి భాజాలు మోగాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నుంచి సౌత్ వరుణ్ తేజ్ వరకు ఓ ఇంటివారయ్యారు. ఇందులో కొన్ని ప్రేమ పెళ్లిలుంటే.. మరికొన్ని అరెంజ్డ్ ఉన్నాయి. ఇంకొన్ని సర్ ప్రైజ్ పెళ్లిలు కూడా ఉన్నాయి.

బాలీవుడ్ లో కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి సందడిగా జరిగింది. జైసల్మీర్ లోని ఓ బిగ్ రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. షేర్షా సినిమా టైంలో వీరి మొదటిసారిగా కలుసుకున్నారు. ఆ తర్వాత చిన్నగా ప్రేమ మొదలైంది. కొన్ని రోజులపాటు డేటింగ్ గట్రా చేసుకుని.. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక్కటైపోయారు.

సౌత్ లో రీసెంట్ గా బాగా పాపులర్ అయిన పెళ్లి కొణిదెల అబ్బాయిదే. వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ ఓరకంగా మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వరుణ్, లావణ్య ఇద్దరూ చాలాకాలంగా లవ్ లో ఉన్నారు. పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లిపీటలు ఎక్కారు. వీరి వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. దానికి మెగా కుటుంబమంతా హాజరైంది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ఓ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి రక్షితారెడ్డిని అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి వివాహం జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో జరిగింది.

మరో పొలిటికల్, మూవీ మ్యారేజ్.. రాఘవ్ చద్దా, పరిణితి చోప్రాలది. వీరి పెళ్లి ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. పరిణితి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాగా.. రాఘవ్ ఆప్ ఎంపీ.

ఇక వీరంతా ఓపెన్ గా ఘనంగా పెళ్లి చేసుకుంటే గోవా బ్యూటీ ఇలియానా సిక్రేట్ గా పెళ్లి చేసుకున్నట్టు రీసెంట్ గా రివీల్ చేసింది. తన బోయ్ ఫ్రెండ్ ను మైఖేల్ డోలన్. ఇతడినే ఈ బెల్లీ సుందరి పెళ్లిచేసుకున్నట్టు..చెప్పింది. ఇంకా సెలబ్రిటీ పెళ్లిల్ల లిస్టులో అమలాపాల్ , దగ్గుబాటి అభిరామ్, కార్తీక, అతియా శెట్టి, హీరో త్రిగుణ్, 60ఏండ్ల వయస్సులో అశిష్ విద్యార్థి.. ఇలా సినీ సెలబ్రిటీలు తమ 2023లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. స్టిల్ బ్యాచ్ లర్ ప్రభాస్ రాబోయే సంవత్సరంలోనైనా పెళ్లిభోజనం తినిపిస్తాడో చూడాలి మరి.

మరికొన్ని కథనాలు…

హీరోయిన్లకు ఏడుపు..అదే మనకు ఎంటర్ టైన్ మెంట్!

RELATED ARTICLES

Most Popular

Recent Comments