భారత్ సమాచార్, క్రీడలు : ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంపాట(ఆక్షన్)కు అంతా రెడీ అయ్యింది. అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఎవరో అని క్రీడాభిమానులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తొలిసారిగా భారత్ వెలుపల ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దుబాయ్ లోని కోకాకోలా అరెనా వేదికగా ఈ ఆక్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం పాటను ప్రారంభించనున్నారు. మొత్తం 1166 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. పది ఫ్రాంచైజీలు 333 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశాయి. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.
10 ప్రాంఛైజీల్లో కలిపి మొత్తం 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 30 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ దగ్గర ఉన్న ఆటగాళ్ల జాబితా ఆధారంగా, డబ్బు ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మాక్ ఆక్షన్స్ ను కూడా ప్రాక్టిస్ కూడా చేశాయి. నచ్చిన ఆటగాళ్ల కోసం కోట్లు గుమ్మరించేందుకు రెడీగా ఉన్నాయి.
ఈ సారి వేలంలో తొలిసారిగా ఓ మహిళ ప్రిమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించనుంది. రీసెంట్ గా మహిళల ప్రిమియర్ లీగ్ ను సమర్థంగా నిర్వహించిన మల్లిక సాగర్.. ఈ వేలంలోనూ ఆమే వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.
10 ఫ్రాంచైజీల్లో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ దగ్గర రూ.38.15 కోట్ల పర్స్ మనీ ఉంది. అత్యల్పంగా లక్నో సూపర్ జైంట్స్ వద్ద రూ.13.5 కోట్లు ఉన్నాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధర ఎవరికీ పలుకుతుందో అనే విషయంపై ఇప్పటికే తీవ్ర ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ (కనీస ధర రూ.2 కోట్లు ) కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత రచిన్ రవీంద్ర, కమిన్స్, కొయెట్జీ, హసరంగ, హెడ్.. తదితరులు అత్యధిక ధరకు అమ్ముడుపోయే అవకాశాలు కనపడుతున్నాయి. చూడారి మరి ఈ సారి జాక్ పాట్ కొట్టే ఆల్ రౌండర్ ఎవరని.