భారత్ సమాచార్, సినీ టాక్స్ : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు బిడ్డ శివాజీ. చిన్న స్థాయి నుంచి వచ్చి ఏ గాడ్ ఫాదర్ లేకుండా హీరో సైడ్ క్యారెక్టర్లు వేసి హీరోగా మారారు. సినీ నటుడిగా శివాజీది క్లీన్ ఇమేజ్. కానీ ఎప్పుడైతే పొలిటికల్ టర్న్ తీసుకున్నాడో అప్పటి నుంచి అతడి మాటలు, చేష్టల ద్వారా వివాదస్పదుడిగా మారారు. మొదట్లో బీజేపీ, ఆ తర్వాత టీడీపీకి ఫుల్ సపోర్టివ్ గా నిలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి వీర సైనికుడిగా పనిచేశారు. ‘‘ఆపరేషన్ గరుడ’’ పేరిట హల్ చల్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం చెందడంతో ఇక సైలంట్ అయిపోయారు. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీకి ఇచ్చారు. ఆయన షోలోకి అడుగుపెట్టినప్పుడు చాలా నెగిటివిటీ ఉండేది.. ఆయన బయటకు వచ్చేసరికి కాస్త తగ్గిపోయిందనే చెప్పాలి. శివాజీ తన ప్రవర్తనతో కొందరికీ హీరోగా.. మరికొందరికి విలన్ గా కనిపించింది వాస్తవం.
‘‘బాబు గారూ.. నేను మాట తప్పాను.. ఇక ఈ వారం బాగుంటానండీ’’ అంటూ పదే పదే చెప్పడం.. మళ్లీ మాటలు తూలడం.. అమర్ దీప్ బ్యాచ్ ను చిన్న చూపు చూడడం, పెద్దరికం పేరుతో తనకు ఇష్టమైన ప్రశాంత్, యావర్ లను ప్రోత్సహించడం వంటివి శివాజీకి ప్లస్, మైనస్ లుగా నిలిచాయనే చెప్పాలి. అయితే యావర్ 15లక్షలు గెలుచుకున్నా.. ప్రశాంత్ విన్నర్ అయినా వారి వెనక శివాజీ మైండ్ గేమ్ ఉందనే చెప్పాలి. శివాజీ సపోర్ట్ వారికి బాగా మైలేజీ ఇచ్చింది. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన శివాజీ తన బిగ్ బాస్ జర్నీపై ఓ వీడియో చేసి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
స్టార్ మా వాళ్లు.. శివాజీని అక్కడ పెట్టారు.. ఇక్కడ పెట్టారు అన్న కామెంట్స్ అవసరం లేదు.. వాళ్లంతా ఓ పద్ధతి ప్రకారం ఓటింగ్ పెట్టారు. అందులో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలని నేను కోరుకున్నాను. ప్రజలు ప్రభుత్వాల చేతిలో ఓడిపోతుంటారు. కామన్ మ్యాన్ గెలవడానికి ఎక్కడా అవకాశం ఇవ్వరు. అందుకే ఈ సీజన్ లోనైనా కామన్ మ్యాన్ గెలవాలని అనుకున్నాను. ప్రశాంత్ లాంటి రైతుబిడ్డ, యావర్ లాంటి సామాన్యులు ఈ షోకు రావడమే గొప్ప. వారికి మంచి అవకాశం వచ్చింది. అందుకే వారికి సపోర్ట్ చేశా. ప్రశాంత్ విజేతగా నిలిచాడు. యావర్ రూ.15లక్షలు సంపాదించాడు.