భారత్ సమాచార్, అంతర్జాతీయం : విధి ఆడే వింత నాటకాలు ఎన్నో ఉంటాయి. అందులో ఎన్నో ఊహించని మలుపులు, వాటిలో కొన్ని అత్యంత భయంకరంగా కూడా ఉంటాయి. జీవితంలో అటువంటి సందర్భం తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పాటు పుడుతుంది. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ ఇటలీ జంటకు కూడా ఎదురైంది. మరి అదెంటో మనం కూడా చూద్దాం..
ఇటలీకి చెందిన ఓ ప్రేమజంట కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకుంది. వారి పేర్లు.. స్టెఫానో పిరెల్లి(30), ఆంటోనియెట్టో డెమాసి(22). ఇటలీలోని సావోనా పట్టణంలో స్నేహితులతో కలిసి క్రిస్మస్ విందులో పాల్గొనేందుకు వేర్వేరు పట్టణాల నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న మినీ విమానాలు(మైక్రో జెట్లు) గమ్యం చేరకముందే దాదాపు ఒకేసారి ప్రమాదాలకు గురయ్యాయి. స్టెఫానో ప్రయాణిస్తున్న టూ సీటర్ ఎయిర్ క్రాప్ట్ లో లోపం తలెత్తి క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ ప్రమాద స్థలానికి 25 మైళ్ల దూరంలో.. ఆంటోనియెట్టో వస్తున్న ఎయిర్ క్రాప్ట్ కూడా అదే సమయానికి ప్రమాదానికి గురైంది. పొగమంచు నడుమ చిమ్మచీకట్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఈ జంటకు త్రుటిలో పెను ప్రమాదం తప్పడం అద్భుతమే. స్టెఫానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడగా.. ఆంటోనియెట్టాకు, ఓ పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయా ప్రాంతాలకు శరవేగంగా చేరుకున్న ఫైర్ సిబ్బంది వారిని రక్షించి.. యువ జంటతో పాటు ఇద్దరు పైలట్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరి ప్రేమ కథలో జరిగిన స్వీట్ క్లెమాక్స్ నెట్టింట వైరల్ గా మారింది.
చూశారా.. వీరి జీవితంలో విధి మంచి చేసిందా లేదా చెడు చేసిందా అంటే ఏమని చెప్తాం. సంతోషంగా వేడుకలు జరుపుకుందామని వెళ్తుంటే ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం అద్భుతమే. కానీ ఇద్దరికీ ఒకే సమయంలో.. విమాన ప్రమాదాలు జరడం విధి రాతే కదా. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించగలరా.. అంతటి పొగమంచులో కూడా అగ్నిమాపకదళాలు గుర్తించడం కూడా వండరే కదా. ప్రమాదంలో బయటపడిన చిమ్మచీకట్లో మంచులో కూరుకుపోతే ఏమయ్యేవారు.